జగనన్న గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సూచించారు. ఆదివారం నర్సీపట్నం మండలం కసిమి రోడ్ లో జగనన్న గృహాల సముదాయాన్ని ఆయన పరిశీలించారు. గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు తాము నిర్మించిన గృహాలను ఎమ్మెల్యేకి చూపించారు. ఆయన మాట్లాడుతూ జగనన్న గృహాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. లబ్ధిదారులు కట్టిన గృహాలు చూసి చంద్రబాబు సిగ్గుపడాలని అన్నారు.