కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బందరు పోర్టు నిర్మాణ పనులుకు సీఎం జగన్ భూమిపూజ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ బందరు పోర్టు రాకుండా చంద్రబాబు అనేక అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. పోర్టు కల సాకారం కాకుండా వేల ఎకరాల భూములను బినామీల ద్వారా చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపించారు. కోర్టు కేసులు అధిగమించి, అన్ని అనుమతులు తీసుకొచ్చి నేడు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించామని అన్నారు.