సమాజంలో హెచ్ఐవి బాధితులను ప్రేమతో ఆదరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ అన్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో నరసరావుపేటలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే 2023 గుర్తుగా క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తుల పట్ల వివక్షత చూపుకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి. శ్యాంప్రసాద్, డాక్టర్ శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.