యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన తురుమెళ్ల రమ్య(22) కొద్ది రోజులుగా తెనాలిలో ఒంటరిగా నివాసం ఉంటోంది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లికి ఫోన్ ద్వారా రమ్య సమాచారం ఇచ్చింది. తల్లి వెంటనే రమ్య ఫోన్ చేయగా ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో వారు తెనాలి చేరుకున్నారు. అప్పటికే ఇంట్లోని ఫ్యాన్‌కు రమ్య చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టూ టౌన్ సీఐ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం యాంకర్‌గా పనిచేస్తూ జీవనం సాగించే రమ్య. తెనాలిలో కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తోందని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసుగా సోమవారం నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రమ్య తల్లిదండ్రులకు ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తల్లితో ఫోన్ మాట్లాడే సమయంలోనే రమ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు వెంకట్రావు తెలిపారు.