సోమవారం ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ బిసి విభాగం సర్వసభ్య సమావేశం నిర్వహించడం మదనపల్లెలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు నాయకులు పాల్గొన్నారు. ఇంచార్జ్ దమ్మలపాటి రమేష్ మరియు రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ అన్నమయ్య జిల్లా బెస్త సాధికార కమిటీ సభ్యులు 14 మంది ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్వాగరాజు, రాష్ట్ర కార్యదర్శి పర్వాణ్ తాజ్, తులసీదర్ నాయుడు, సిద్ధప్ప నీలకంఠ, తదితరులు పాల్గొన్నారు.