అస్సాం AFSPA ఉపసంహరణ: అస్సాం నుండి AFSPA ను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం తెలిపారు. రాష్ట్రంలోని పోలీసు బలగాలకు మాజీ సైనిక సిబ్బంది నుంచి శిక్షణ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.గత రెండేళ్లలో శాంతిభద్రతలు బాగా మెరుగుపడినందున మరో ఐదు జిల్లాల నుంచి AFSPAని తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అస్సాం సీఎం ఇటీవల చెప్పారు.ప్రస్తుతం, రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం, 1958 లేదా AFSPA కింద ఉన్నాయి. ఈ చట్టం భద్రతా బలగాలకు ముందస్తు వారెంట్ లేకుండా ఆపరేషన్లు నిర్వహించి ఎవరినైనా అరెస్టు చేసేందుకు అధికారం ఇస్తుంది.