భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్-3 ప్రయోగం జులై 12న జరగనుంది. షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ఏడాది జులై 12న వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆగస్టు 23 లోపు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ కాలుమోపే అవకాశముంది. 2019లో చంద్రయాన్-2 విఫలమైన తర్వాత చంద్రయాన్-3 మిషన్‌కు ఇస్రో శ్రీకారం చుట్టింది.