ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాను కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు సిసోడియా మెడను పట్టుకుని తీసుకెళ్లడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.