నూతన పార్లమెంటు భవనాన్ని PM మోదీ ప్రారంభించే ముందు రాజ్యాంగాన్ని ఒకసారి చదవాలని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ తెలిపారు. కేంద్రమంత్రులు కూడా చదివితే బాగుంటుందని సూచించారు. ఉభయ సభలు, రాష్ట్రపతిని కలిపే పార్లమెంటు అంటారని చెప్పారు. అంతకుముందు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. రాష్ట్రపతి ఉభయ సభల్లోను సభ్యులు కాదన్నారు.