యూపీఎస్సీ ఫలితాల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ సత్తాచాటారు. ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రామ్ భజన కుమార్ తన ఎనిమిదో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 667 ర్యాంకుతో సత్తాచాటారు. తాను రాజస్థాన్ నుండి వచ్చానని, తన తండ్రి కూలీగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. తన భార్య అందించిన ప్రోత్సాహంతోనే విజయం సాధించానని పేర్కొన్నారు.