అమరావతి దళిత జేఏసీ నేత పులి చిన్నను తుళ్లూరు పోలీసులు బుధవారం ఉదయం 6 గంటలకు హౌస్ అరెస్ట్ చేశారు. మండలంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండడం వలన ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్టు తుళ్ళూరు పోలీసులు తెలిపారు. సీఎం జగన్ వెంకటపాలెం పర్యటన నేపధ్యంలోనే పోలీసులు రెండు రోజులు ముందుగానే అరెస్టులు చేస్తున్నారని. సీఎంకు కనీసం వినతిపత్రం అందజేసే హక్కు అమరావతి రైతులకు లేదా అని పులి చిన్న ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రజలే జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.