చిలకలూరిపేట మండలం నాదెండ్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2022-23 సంవత్సరానికి 15వ విడత సామాజిక ప్రజావేదిక తనిఖీలు బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఏపీఓ పుష్పరాజు తెలిపారు. అన్ని పంచాయతీల్లో 2022-2023 సంవత్సరంలో రూ. 6, 61, 22, 169 పనులు జరిగాయన్నారు. ఒక ఎస్ఆర్పీ, 8 మంది డీఆర్పీలతో ప్రతి గ్రామంలో సామాజిక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.