పొన్నూరు పట్టణ పరిధిలోని నిడుబ్రోలులో నిర్మించిన 1. 660 టిట్కో గృహాలను తొలివిడతగా బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదగా పంపిణీ చేస్తున్నట్లు పొన్నూరు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎన్ రాధా బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య తో పాటు ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఏపీ టిట్కో చైర్మన్ ప్రసన్నకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి హాజరవుతారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, లబ్ధిదారులు హాజరవుతారని పేర్కొన్నారు.