ఎమ్మిగనూరు పట్టణంలో ప్రజలను బెంబేలిస్తున్న గ్రామ సింహాలు పగలు రాత్రి తేడా లేకుండా వీధిలంట ఆడుకునే పిల్లలను వెంబడించి మరి కరుస్తున్నాయి. కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. రాత్రి సమయంలో పట్టణములోని పలు కాలనీలు ముగతిపేట, హెచ్. బి. ఎస్ కాలనీ, సంజీవ్ నగర్ కాలనీ, గీతానగర్, ఎన్టీఆర్ కాలనీ, వీవర్స్ కాలనీ, లక్ష్మీపేట, ఎంబి చర్చ్, అటకారి వీధి, మైనారిటీ కాలనీ, శివ సర్కిల్ తదితర అన్ని ప్రధాన వీధులలో వాటి సంచారం ఎక్కువైంది. రాత్రి సమయంలో కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఇంటికి వెళ్లే వారిని బైకు వెనక వెంబడించడం వల్ల ప్రాణాలు మీదకు తెచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు ప్రత్యేకంగా కోరుతున్నారు.