పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గడియార స్తంభం వద్ద బుధవారం మజ్జిగ పంపిణీ చలివేంద్ర కేంద్రాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కొత్త రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.