ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. 2014-15 ఆదాయ లోటును పూడ్చేందుకు ప్రత్యేక సాధారణ ఆర్థిక సహాయం కింద 10,460 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత విడతల వారీగా నిధులను విడుదల చేసిన కేంద్రం తొలిసారిగా ఏక మొత్తంలో నిధులు రిలీజ్ చేసింది. 2014-15లో రూ.2,303 కోట్లు, 2015-16లో కేవలం రూ.500 కోట్లు, 2016-17లో రూ.1,176 కోట్లు కలిసి మొత్తం సుమారు 4 వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది.