మొబైల్ ఫోన్ చోరీ కేసులో ఓ వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ నరసింహారెడ్డి తెలిపారు. బంగారుపాలెం మండలం కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియాతో సీఐ మాట్లాడుతూ ఈ నెల 20న ప్రభుత్వాస్పత్రి ఎదురుగా ఉన్న ఎంఐ మొబైల్ షాపులో చోరీ జరిగింది. రూ. 2. 40 లక్షలు విలువ కలిగిన పోన్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దొంగతనానికి పాల్పడిన శాంతిపురం మండలం కర్లగట్టుకు చెందిన సతీషన్ను మొగలిక్రాస్ వద్ద బుధవారం అరెస్టు చేసి, అతడి వద్ద ఉన్న 25 ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు.