మే 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తామని మొత్తం 20 ప్రతిపక్షాలు బుధవారం ప్రకటించగా.. దానికి భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి హాజరవుతామని 15 పార్టీలు ప్రకటించాయి. ఈ 15 పార్టీలు ఎక్కువగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)కి చెందినవే.మే 28న జరిగే ఆవిర్భావ వేడుకలకు అధికార పార్టీ భారతీయ జనతా పార్టీతో పాటు కింది పార్టీలు హాజరు కానున్నాయి.