ఐపీఎల్ తుది పోరు ప్రారంభానికి ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ ర్యాపర్లు ఇందులో ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రముఖ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రదర్శన కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. అలాగే తొలి ఇన్నింగ్స్ ముగిశాక జోనితా గాంధీ, డివైన్ జోడీ ప్రదర్శన ఉండనున్నట్లు తెలుస్తోంది.