పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా ఫగ్వారా పోలీస్‌స్టేషన్ పరిధిలో పన్నెండేళ్ల బాలిక శనివారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చినప్పటికీ.. ఆ విషయం ఆమెకు తెలియకపోవడం గమనార్హం. బాలిక కడుపునొప్పితో బాధపడుతూ గురునానక్ దేవ్ ఆసుపత్రికి రావడంతో.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భిణి అని నిర్ధారించారు. అనంతరం ప్రసవం చేసి 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు.