నిప్పంటించుకుని ఓ లారీ డ్రైవర్ శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోటలో చోటుచేసుకుంది. ఎస్సై రామ్మోహన్ కథనం. బి. కొత్తకోట బీసీ కాలనీలో ఉంటున్న లోకేష్ లారీ డ్రైవర్ గా పని చేస్తూ తన భార్య గుల్తాజ్ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి కుటుంబీకులతో గొడవపడి ఒంటిపై పెట్రోల్ పోసుకొని కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.