ఆటో డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన శనివారం రాత్రి మదనపల్లిలో జరిగింది. పోలీసుల కథనం స్థానిక కొత్తఇండ్లలో ఉండే మహమ్మద్ రఫీ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన రఫీ చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.