వై. ఎస్. ఆర్ జిల్లా ఎస్. పి కే. కే. ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప రూరల్ చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని అజాద్ నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను ఆదివారం ఉదయం నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి వాహనాల రికార్డులను చింతకొమ్మ దిన్నె ఎస్. ఐ అరుణ్ రెడ్డి, సిబ్బంది పరిశీలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు.