ఉద్యోగులు మరో ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టకముందే వారి సమస్యలు పరిష్కరించాలని ఏపీ JAC అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తమ ఉద్యమం ఉద్యోగుల కోసమే కానీ, నాయకుల ప్రయోజనం కోసం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల్లో చీలికలు తేవడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని బొప్పరాజు తేల్చి చెప్పారు.