రాజమండ్రి మహానాడు బహిరంగ సభ వేదిక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ మేనిఫెస్టోపై వైసీపీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. అమలుచేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసినవారు ... ఇప్పుడు అల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ 'మాయా'ఫెస్టోలో ఎవరు పడతారు? అంటూ విజయసాయిరెడ్డి ట్విట్ చేసారు.