ప్రధాని మోదీ నేడు మరో వందే భారత్ రైలును ప్రారంభించారు. అసోంలో తొలి వందే భారత్ రైలును నేడు వర్చువల్ గా ప్రారంభించారు. నిజమైన సామాజిక న్యాయం, లౌకికవాదాన్ని ప్రతిబింబించేలా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ మౌలిక సదుపాయాలు ఉంటాయని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, అసోం గవర్నర్ గులాబ్ చంద్ పాల్గొన్నారు.