కర్ణాటకలో తమ పార్టీ గెలిస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని నెరవేర్చేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 1 నుండి రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని, ఇందుకోసం ఎలాంటి షరతులు ఉండవని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఈ పథకంపై నేడు సీఎం ప్రకటన చేస్తారని చెప్పారు.