అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని గుంటూరు ఆర్డీవో ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం తుళ్లూరు మండలం ఐనవోలులో నిర్మించిన లే అవుట్ వద్ద తాడికొండ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్, ఆర్డీవో ప్రభాకర్ రెడ్డిలు అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే దరఖాస్తు చేసుకుంటే వారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు. ఎవ్వరూ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు.