ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ కొట్టే సంస్కృతి టీడీపీలో లేదని, హామీలు అమలు చేసే వాటిని మేనిఫెస్టోలో పొందుపరిచామని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైసీపీ పాలన బూతుల పాలన మయంగా మారిందన్నారు. టీడీపీ మేనిఫెస్టో చూసి వైసీపీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. సామాజిక న్యాయం చేసింది టీడీపీనే అని స్పష్టం చేశారు. చంద్రబాబు రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు.