ఏపీలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైఎస్సార్ పింఛను కానుక కింద నేటి నుండి పింఛన్లు అందజేయనున్నారు. నేటి నుండి 5 రోజుల పాటు వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లు అందజేస్తారని డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు తెలిపారు. మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల కోసం రూ. 1,739 కోట్లను విడుదల చేశామని పేర్కొన్నారు.