గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వ గ్యాస్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. ప్రతి నెలా వంట గ్యాస్ ధరల సవరణలో భాగంగా నేడు ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 83.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కమర్షియల్ సిలిండర్ పై గత నెలలోనూ రూ. 172 తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.