నెల్లూరు జిల్లా కావలి పురపాలక సంఘం కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న బి. శివారెడ్డి ని మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తిరుపతి లో ఆడిట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఇ. కిరణ్ ను ఒక ఏడాది డిప్యూటేషన్ పై కావలి మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు.