కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలతోనే వ్యవసాయ రంగం కుదేలైందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వి. వి. ప్రసాద్ గురువారం విమర్శించారు. జూన్ 13, 14, 15 తేదీలలో నరసరావుపేటలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రైతు సమ్మేళనం 3 రోజులు జరుగుతుందని ఈ సమ్మేళనంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టనున్నట్లు సత్తెనపల్లిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన వెల్లడించారు.