అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరువు నష్టం కేసులో క్రిమినల్ శిక్ష పడిన తొలి వ్యక్తి తనేన్నారు. అంతేకాకుండా అదే కేసులో పార్లమెంటులో అనర్హత వేటుకు గురైన తొలి నేతను కూడా తానేనని చెప్పుకొచ్చారు. అనంతరం ఇండియాలో కొంతమంది ప్రజలకు తమకంతా తెలుసనుకునే వ్యాధి ఉందంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శించారు.