రెజ్లర్ల వివాదంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఈ సమస్యను చాలా సున్నితంగా హ్యండిల్ చేస్తున్నామన్నారు. ‘‘రెజ్లర్లు చేసిన డిమాండ్లన్నింటినీ పూర్తి చేస్తున్నాం. ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ నమోదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటాం. చట్టం అందరికీ సమానమే, ప్రతి ప్లేయర్ మాకు ముఖ్యమే అని ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నవారికి చెప్తున్నా’’అని అన్నారు.