పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల ఇంజినీర్-ఇన్-చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గురువారం కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం నారాయణరెడ్డి సమీక్ష వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అడహక్ నిధుల కింద రూ.17,414 కోట్లు కేంద్రాన్ని కోరిందని తెలిపారు.