చేపలు పడుతూ పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి, పాక్ జైళ్లలో మగ్గుతున్న భారత మత్స్యకారులకు త్వరలో విముక్తి లభించనుంది. పాకిస్థాన్ వారిని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో భారత అధికారులు ఇటీవల పాకిస్థాన్ తో చర్చలు జరపడంతో వారిని విడిచిపెట్టేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. తొలివిడతలో మే 12న 198 మంది మత్స్యకారులను విడుదల చేయగా, తాజాగా 200 మందిని, జులై 3న మరో 100 మందిని పాక్ విడుదల చేయనుంది.