ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుతిన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు తన సంతాపాన్ని పంపారని భారత్ లోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. 'ఈ ఘోర ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధను మేము పంచుకుంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం' అని పుతిన్ పేర్కొన్నారు.