గత రాత్రి ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ప్రెస్లో 178 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) వెల్లడించారు. వారిలో 100 మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. జనరల్ బోగీల్లో ఎంతమంది ఏపీ ప్రయాణికులున్నారో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఇక యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో ఎంతమంది ఏపీ ప్రయాణికులు ఉన్నారో తేలాల్సి ఉందన్నారు.