ఒడిశా రైలు ప్రమాదంలోని దృశ్యాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. బోగీలు ఒకదానిపై ఒకటి ఎగిరి మీద పడడంతో ఓ బోగీ నేలలో కూరుకుపోయింది. దీన్ని బయటకు తీయడం రెస్క్యూ సిబ్బందికి సవాలుగా మారింది. దీన్ని బయటకు తీస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ట్రాక్ పై శకలాలను తొలగించి అంతా క్లియర్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటివరకూ 280 మంది మరణించారు.