ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏకకాలంలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా ఉండిపోవాల్సిన ఓ విషాదం. ఓ శాంతి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకూడదు. ఈ విషాదానికి మూల కారణం తెలుసుకోవాలి. ఫెయిల్- సేఫ్ మెకానిజం వ్యవస్థను మరోసారి సమీక్షించాలి.’