ఐపీఎల్ 2026లో మరో హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ ఆసక్తికర మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఇప్పటివరకు అపజయం లేకుండా అద్భుత ఫామ్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో కూడా విజయ పరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తన ఆధిపత్యాన్ని మరింత బలపరచాలని చూస్తోంది.మరోవైపు, ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలనే పట్టుదలతో రాజస్థాన్ జట్టు సిద్ధమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa