ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చాహల్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ప్రీతి జింటా

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 28, 2026, 08:00 PM

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత ఫామ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జట్టులో ప్రస్తుతం మంచి జోష్, ఆత్మవిశ్వాసం నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటా మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చాహల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సరదాగా స్పందిస్తూ, “మేడమ్.. నాకు ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా?” అని అడిగాడు. దీనికి ప్రీతి జింటా కూడా అంతే సరదాగా రిప్లై ఇస్తూ, “తప్పకుండా చాహల్.. నీ కోసం ఏదైనా చేస్తాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత నీకు నచ్చిన మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయొచ్చు. అప్పుడు ప్రబ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య కూడా ఏమీ అనుకోరని నాకు తెలుసు” అంటూ లాఫింగ్ ఎమోజీ జతచేసింది. ఈ సమాధానంతో చాహల్ ఒక్కసారిగా షాక్ అయినట్లు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ భారీ విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రీతిలో 265 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించి కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ విజయంతో పంజాబ్ తన అగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంది.గత సీజన్‌లో ఆర్సీబీ చేతిలో ఫైనల్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్, ఈసారి మాత్రం టైటిల్ లక్ష్యంగా మరింత దూకుడుగా కనిపిస్తోంది. ఇదే ఫామ్ కొనసాగితే ప్లేఆఫ్స్‌కు చేరే తొలి జట్టుగా నిలిచే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa