ఒడిశాలోని కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై నిపుణుల బృందం రైల్వే శాఖకు ప్రాథమిక నివేదిక అందజేసింది. సిగ్నల్ లోపం కారణంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ మరో ట్రాక్ లోకి ప్రవేశించడం వల్లే ఈ పెను విషాదం సంభవించిందని వెల్లడించింది. ‘ఈ రైలు మెయిన్ లైన్ లోనే చెన్నై వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, బహానగా స్టేషన్ దాటిన కొద్దిసేపటికే పొరపాటున లూప్ లైన్ లోకి ప్రవేశించింది.’ అని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు.