ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండెపోటుతో యువనటుడు నితిన్ గోపి మృతి

national |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 09:54 PM

కన్నడ చిత్రసీమకు చెందిన యువనటుడు నితిన్ గోపి మృతి చెందాడు. 39 ఏళ్ల నితిన్ గోపి నిన్న రాత్రి గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచాడు. నితిన్ మరణంతో శాండల్ వుడ్ షాక్ కు గురైంది. నితిన్ తన తల్లిదండ్రులతో కలసి బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన నితిన్ పలు చిత్రాల్లో నటించాడు. సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశాడు. ఒక కొత్త సీరియల్ కు దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతుండగా విషాదం చోటు చేసుకుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa