ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఏఎం చౌదరి నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్టు శనివారం రైల్వే శాఖ ప్రకటించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో సీఆర్ఎస్ పని చేస్తారు. కాగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తైందని, పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్నట్టు రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ వెల్లడించారు.