ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో లోకో పైలెట్లకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ లోకో పైలెట్ జీఎన్ మహంతికి పక్కటెముక విరిగిందని, ఏఎల్పీ హజారీ బెహరా కాలు విరిగిందని వెల్లడించారు. బెంగళూరు-హౌరా రైలు గార్డుకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. గూడ్స్ రైలు లోకో పైలెట్, గార్డుకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు.