కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో లోకో పైలట్ మహంతి మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన భువనేశ్వర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఈ ఘోర ప్రమాదానికి లోకో పైలట్ తప్పేమీ లేదని రైల్వే బోర్డు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతలో సిగ్నల్ మేరకు లూప్ లైన్ పై ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఢీకొనడంతో బోగీలు గాలిలోకి దూసుకెళ్లాయి.