ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ దుర్ఘటనలో టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం చెల్లించనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు టికెట్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఈ రైలు ప్రమాదానికి గురైన వారందరికీ పరిహారం అందుతుందని రైల్వే ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.