మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ 600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి టీటీడీకి కేటాయించిందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ స్థలంలో రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా రూ.100 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించనున్నట్లు తెలపారు. జూన్ 7న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.